అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్ అంత్యక్రియలు

0
103

అశ్రునయనాల మధ్య రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. పోస్ట్ మార్టం అనంతరం రాకేష్ భౌతికకాయాన్ని వరంగల్, నర్సంపేట నుండి జనసందోహం మధ్య స్వగ్రామానికి తరలించారు. రాకేష్ పాడెను పలువురు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మోశారు. ఖానాపూర్ మండలంలోని దబీర్ పేటలో రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. రాకేష్ భౌతికకాయాన్ని చూసిన బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా నిన్న సికింద్రాబాద్ కాల్పుల్లో రాకేష్ మృతి చెందిన విషయం తెలిసిందే.