రామ మందిరం నిర్మాణానికి వీరు ఎంత విరాళం ప్రకటించారో తెలిస్తే షాకవుతారు

రామ మందిరం నిర్మాణానికి వీరు ఎంత విరాళం ప్రకటించారో తెలిస్తే షాకవుతారు

0
89

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు వస్తాయి అని అందరూ భావించారు… అంతేకాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామ మందిర నిర్మాణం బంగారంతో నిర్మిస్తారు అని వార్తలు వచ్చాయి.. గుడి గోడలు ప్రహారీలు ఇలా అన్నీ కూడా బంగారంతో నిర్మిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.

అలాగే వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో బంగారం స్వామికి ఇస్తారు అనేలా వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి, అయితే తాజాగా బీహార్ లోని మహావీర్ మందిర్ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించింది.. తాము రూ.10 కోట్లు విరాళాన్ని ఇస్తున్నాము అని తెలిపారు.

ఇక మందిరానికి ముందు రెండు కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు, దీనిని చెక్కుగా అందిస్తామని తెలిపారు, మిగిలిది ట్రస్టుకి నిర్మాణం పూర్తి అయ్యేలోపు జమ చేస్తాము అన్నారు. ఇటీవల వీరు ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించారు ఈ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో ముద్రించిన అణాపైస విలువ చేసే నాణేలు కూడా వచ్చాయి అవి కూడా రామ మందిర ఆలయ ట్రస్ట్ కు అందజేస్తామని తెలిపారు.. వాటిపై సీతా రాముల రూపాలు ఉన్నాయి.