రాములోరి తలంబ్రాలు కావాలా ఈ యాప్ లో వ‌స్తాయి

రాములోరి తలంబ్రాలు కావాలా ఈ యాప్ లో వ‌స్తాయి

0
98

ఈసారి రాముల వారి క‌ల్యాణం చూడాలి అని చాలా మంది అనుకున్నారు… కాని రాముల వారి క‌ల్యాణం జ‌రిగినా అక్క‌డ చూడ‌టానికి భక్తుల‌కి అనుమ‌తి ఇవ్వ‌లేదు.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతున్న వేళ, ఇండియా లాక్ డౌన్ లో ఉన్న స‌మ‌యంలో దీనికి అవ‌కాశం క‌ల్పించ‌లేదు.

నేరుగా లైవ్ లో కల్యాణం చూసి అంద‌రూ స్వామి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో తలంబ్రాలు పొందేందుకు T-App Folio యాప్‌ను ప్రారంభించినట్లు భద్రాద్రి రామాలయ అధికారులు తెలిపారు. గురువారం ఆలయంలో ఈ యాప్‌ను రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.

ఇక స్వామివారి క‌ల్యాణానికి సంబంధించి ఈ త‌లంబ్రాలు కావాలి అంటే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. రెండు ముత్యాలు గల ఒక తలంబ్రాల ప్యాకెట్‌కు రూ.20 ధర ఉంటుందని, ఒక్కొక్కరూ రెండు ప్యాకెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. సో కావాలి అంటే మీరు ఇలా బుక్ చేసుకోండి, జై శ్రీరామ్