రైల్వే టికెట్ బుకింగ్స్ పై రైల్వేశాఖ గుడ్ న్యూస్

రైల్వే టికెట్ బుకింగ్స్ పై రైల్వేశాఖ గుడ్ న్యూస్

0
106

మన దేశంలో మార్చి 22 నుంచి ఈ కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు, అయితే ట్రైన్లు నిలిచిపోయాయి, అయితే అన్ లాక్ పిరియడ్లో కొన్ని స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ చేశారు, ఈ ట్రైన్స్ పరిమితంగా నడుస్తున్నాయి.

అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ, ఇటు రైలు ప్రయాణాలు చెయ్యడానికి కూడా చాలా మంది
జంకుతున్నారు, ఈ సమయంలో రైల్వే బుకింగ్స్ లో కూడా చాలా మందికి ఈజీగా టికెట్స్ దొరుకుతున్నాయి, ఈ టైమ్ లో రైల్వే బుకింగ్స్ కు సంబంధించి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

రైల్వే బుకింగ్ వెబ్ సైట్ ను ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఆధునీకరిస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. 2018 వ సంవత్సరంలో రైల్వేశాఖ చివరిసారిగా ఐ.ఆర్.సి.టి.సి వెబ్ సైట్ ను ఆధునీకరించింది.
మళ్లీ ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నారు, ఇక ఆగస్ట్ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది, చూడాలి ఈ లుక్ ఎలా ఉంటుందో అని చూస్తున్నారు.