జనసేన పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… శీతాకాల సమావేశాల్లో ఆయన మరోసారి ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జై కొట్డడంతో త్వరలో ఆయన వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు….
తనకు పార్టీ మారే ఆలోచనలేదని అన్నారు…. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ మారడం అన్నది సర్వ సాధారణమేనని చెప్పారు… గతంలో రాజకీయ నేతలకు విలువలు ఉండేవని ఇప్పుడు పార్టీ మారే వ్యక్తులను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని రాపాక అన్నారు…..
జనసేన పార్టీనుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీ నుంచి వీడటానికి నాదేండ్ల మనోహరే కారణమని చెబుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు… పార్టీకి సంబంధించిన ఏ అంశం అయిన పవన్ నాదేండ్లతోనే చర్చిస్తారని రాపాక ఆరోపించారు… వ్యక్తిగతంగా మనోహర్ కు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు…