రాపాకకు పవన్ నోటీసులు

రాపాకకు పవన్ నోటీసులు

0
92

జనసేన పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇటీవలే రాపాక అసెంబ్లీ సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఒక వైపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కూడా చేస్తున్నారు…. అయితే రాపాక మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియంను స్వాగతిస్తున్నారు…

ఉరుకులూ పరుగుల జీవితంతో ప్రతీ ఒక్కరికి ఇంగ్లీష్ అవసరమని అన్నారు.. అందుకే తాను ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వగతిస్తున్నానని చెప్పడమే కాకుండా జగన్ పై ప్రశంశలు కురించారు… ఇది జనసేనకు మింగుడు పడక ఆయన షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి…