ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు… సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పవన్ పోరాడుతున్నారు… ఉద్యమాలు కూడా చేశారు.. అయితే ఆయన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి జై కొట్టడమే కాకుండా సర్కార్ తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియంకు మద్దతు పలికిరు…
ఇక దీనిపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాపాకకు షొకాజ్ నోటీసులును జారీ చేసిందని వార్తలు వచ్చారు.. అంతేకాదు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొందని వార్తలు వచ్చాయి దీనిపై పవన్ వివరణ ఇచ్చారు… ఇది వైసీపీ మద్దతు దారులు దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు…
రాపాకకు నోటీసులు వెళ్లాయని వైసీపీతో సంబంధం ఉందన్న వెబ్ సైట్ లోనే మొదటగా పబ్లిష్ అయిందని తెలిపారు… ఆ వెబ్ సైట్ లలో వార్తలు రాయడం వెనుక ఎవరో ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు….