వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండు నెలలు పూర్తయ్యి 100 రోజుల దిశగా వెళ్తుంది.ఇప్పటివరకు జగన్ ఎన్నో మాటలు అయితే చెప్పారు కానీ పూర్తి స్థాయిలో వాటిని ప్రజల్లోకి చేరవేసే విషయంలో గట్టిగా విఫలం అయ్యారు.దీనితో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు మరియు నిరసనల వెల్లువలు లేవనెత్తుతున్నాయి.ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో మొట్టమొదటి సరిగా పోటీ చేసి గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ మొదట్లో జగన్ ఇచ్చిన హామీలు నిర్ణయాలు చూసి తాను కూడా జగన్ ను కొనియాడారు.
కానీ ఇప్పుడు వ్యవహరిస్తున్న శైలి పట్ల తన స్పందనను కూడా ఘాటుగానే తెలియజేసారు.ఈ రోజు తిరుమల సన్నిధానానికి వెళ్లిన రాపాక మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ కొంతలోనే చాలా వ్యతిరేకతను తీసుకొచ్చిందని ఈ కొత్త ప్రభుత్వం పై తీరుతో ప్రజలు ఏమాత్రం కూడా సంతృప్తిగా లేరని గతంలో చంద్రభాను సీనియర్ కాబట్టి ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే ఆయన రాష్ట్రానికి ఏమి చెయ్యలేదని అలాగే జగన్ యువకుడు కష్టపడి తిరుగుతున్నాడని జగన్ కు అవకాశం ఇస్తే సక్రమమైన పాలన జరగడం లేదని కేవలం కక్ష సాధింపుగా మాత్రమే జరుగుతుందని మండిపడ్డారు.