హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు..“వాయిస్ ఆఫ్ కస్టమర్” సర్వీస్ భేష్

0
85

GMR హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ఘనత దక్కింది. వరుసగా రెండోసారి ACI వరల్డ్ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) వారి “వాయిస్ ఆఫ్ కస్టమర్” గుర్తింపు లభించింది. 2021లో కోవిడ్ సమయంలో ప్రయాణీకుల అవసరాలను అర్థం చేసుకుని, దానికి తగిన చర్యలను తీసుకుంటూ చేసిన నిరంతర కృషికి ఈ గుర్తింపు లభించింది.

విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో పోషించిన చురుకైన పాత్రకు గాను హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ గుర్తింపు దక్కింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఇఓ శ్రీ ప్రదీప్ పణికర్ వరుసగా రెండోసారి ఈ గుర్తింపును పొందడం మాకు దక్కిన గౌరవం. మా భాగస్వాములందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుత పరిస్థితులలో ప్రయాణికుల విశ్వాసాన్ని పొందడానికి ఉమ్మడిగా కృషి చేయడం చాలా అవసరం.

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మేం విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనల అమలుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ప్రయాణికుల భద్రత కోసం వీడియో అనలిటిక్స్ వినియోగం, అదనపు ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు వంటి అనేక చర్యలు తీసుకున్నాం. విమానాశ్రయ ఆపరేటర్‌గా మాకు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యం. దానికోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అన్నారు.

జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు జీఎంఆర్ నిర్వహిస్తున్న మరో విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికీ ఈ గుర్తింపు లభించింది. జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలు రెండూ గత ఏడాది ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI), ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) 2020 అవార్డులను గెల్చుకున్నాయి.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ 15-25 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానమ్ (MPPA) విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్’ అవార్డు లభించగా, ఢిల్లీ విమానాశ్రయం 40 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానమ్(MPPA) పైబడిన విభాగంలో ‘అవార్డు లభించింది. ASQ అనేది ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయలలో ప్రయాణీకుల సేవ, విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని కొలిచే బెంచ్ మార్కింగ్ కార్యక్రమం.