బ్రేకింగ్ – వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? అసలు నిజమేనా?

బ్రేకింగ్ - వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? అసలు నిజమేనా?

0
84

ప్రపంచం 9 నెలలుగా కరోనాతో విలవిలలాడుతోంది, ఈ సమయంలో ఈ కరోనాకి విరుగుడుగా రష్యావ్యాక్సిన్ తీసుకువచ్చింది, ఈనెల 11న మాస్కోలో జరిగిన ప్రెస్ మీట్ లో పుతిన్ స్వయంగా ప్రకటించారు, అంతేకాదు ఆ టీకాని తన కుమార్తెకు కూడా ఇచ్చాము అని తెలిపారు.

అయితే డోసు తీసుకున్న మూడు రోజులకే వికటించడంతో పుతిన్ కూతురు మరణించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి, అయితే ఇది పూర్తి అవాస్తవం, ఇందులో నిజం లేదు, ఈ టీకా తీసుకున్న వారు అందరూ క్షేమంగా ఉన్నారు, దీని కంటూ సపరేట్ డిపార్ట్ మెంట్ వారి ఆరోగ్యం గురించి నిత్యం తెలుసుకుని మానిటరింగ్ చేస్తున్నారు.

ఈ రష్యా వ్యాక్సిన్ పైన నెగిటీవ్ వార్తలు ఇచ్చేందుకు కావాలనే కొందరు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు అని ఈ వార్తలు కొట్టిపారేశాయి రష్యా మీడియాలు..స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సేఫ్ కాదు అని ప్రచారం చేయడానికి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.. అంతేకాదు ఈ వార్తలు కథనాలు చూసి ఇది నిజం కాదని ఆమె బాగానే ఉంది అని ఫ్యాక్ట్ ఫైండర్లు వెల్లడించారు. చూశారుగా కొందరు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేస్తున్నారో.