రేషన్ కార్డు రాలేదా అయితే ఇలా చేయండి మీకో గుడ్ న్యూస్

రేషన్ కార్డు రాలేదా అయితే ఇలా చేయండి మీకో గుడ్ న్యూస్

0
100

ఏపీలో సర్కారు కొత్త రేషన్ కార్డులని వాలంటీర్ల ద్వారా అందిస్తోంది.. మొత్తం నాలుగు రోజుల పాటు వాలంటీర్లు రేషన్ కార్డుల లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఈ కార్డులు అందించనున్నారు…ప్రతి కార్డుపైనా తహశీల్దారు డిజిటల్ సంతకం తప్పనిసరి చేశారు. అందుకే కాస్త కార్డులు రావడం ఆలస్యమవుతోందట.

వారం రోజుల తర్వాత కూడా కార్డు రాకపోతే మీరు వాలంటీర్ ని సంప్రదించాలి అని అర్హులకి అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రేషన్ కార్డులకి పించన్ కార్డులకి సంబంధం లేదు, అలాగే వసతి దీవెన కార్డు విడిగా ఇస్తారు, ఆరోగ్య శ్రీకార్డు విడిగా ఇస్తారు అని చెబుతున్నారు అధికారులు.

కొత్త రేషన్ కార్డులు కలర్ఫుల్గా ఉన్నాయి. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫొటోలతోపాటు, ప్రభుత్వం చిహ్నంతో వైసీపీ గుర్తులు ముద్రించారు. ఈ రేషన్ కార్డులు విజయవాడలో ప్రింటింగ్ అవుతున్నాయి. మీ రేషన్ కార్డు నెంబర్ మీ పేరు తల్లితండ్రి, భార్య పిల్లల పేర్లు కుటుంబ సభ్యులు పేర్లు ఇందులో ఉంటాయి.