తెలంగాణలో రేషన్ తీసుకోవాలి అంటే నేటి నుంచి ఓటీపీ విధానం అమలులోకి వస్తుంది.. అంటే మీరు కచ్చితంగా మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ చెబితేనే మీకు రేషన్ ఇస్తారు, సో ఫ్రిబ్రవరి 1 నుంచి ఈవిధానం అమలు చేస్తున్నారు.
ముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే ఇలా డీలర్ కు ఓటీపీ చెప్పాల్సిందే, ఇక ఇప్పటి వరకూ ఉన్న ఐరిస్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇక పనిచేయదు.
మీరు రేషన్ కు వెళ్లిన సమయంలో తమ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ చెప్పి రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలి.
మరి ఇలా మీకు ఓటీపీ రావాలి అంటే కచ్చితంగా మొబైల్ నెంబర్ను ఆధార్ నెంబర్కు లింక్ చేయడం తప్పనిసరి..అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు కూడా ఇలా చేయాల్సిందే. ఇక ఫ్రిబ్రవరి ఒకటి నుంచి రేషన్ కార్డులో ఉన్న ఓ వ్యక్తి ఎవరైనా వెళ్లి ఇలా రేషన్ తెచ్చుకోవచ్చు.