రేషన్ కార్డు ఉందా మీకు గుడ్ న్యూస్ తప్పక ఇలా చేయండి

రేషన్ కార్డు ఉందా మీకు గుడ్ న్యూస్ తప్పక ఇలా చేయండి

0
94

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని తాజాగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపురల్లో ఈ సదుపాయం ప్రారంభమైంది… దీంతో వీరికి వైట్ రేషన్ కార్డు ఉంటే వీరు ఎక్కడైనా రైస్ రేషన్ సరుకులు తీసుకోవచ్చు, ఉద్యోగాలు కూలీపనులు ఉపాది నిమిత్తం ఓ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి చాలా మంది వెళ్లిపోతున్నారు దీని వల్ల వారు రేషన్ పొందడం లేదు అందుకే కేంద్రం కూడా తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ సౌకర్యాన్ని 2020 జూన్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను వన్ నేషన్ వన్ రేషన్ విధానానికి అనుసంధానిస్తారు.

దీంట్లో భాగంగా..రేషన్ కార్డులను కొత్త ఫార్మాట్లో రూపొందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త కార్డులు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీచేసే కార్డులన్నీ ఒకే స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటాయి.

తాజాగా పౌరసరఫరాల శాఖ అదికారులు చెప్పేది అదే ..పేదప్రజలకు రేషన్ కార్డు ఏ స్టేట్ లో ఉంటే అక్కడ మాత్రమే రేషన్ వచ్చేది.. అయితే ఇలాంటి సమస్యలు ఉండకుండా కేంద్రం నుంచి ఒకే రేషన్ కార్డ్ ఫార్మెట్ విడుదల చేస్తున్నారు, అంతా ఆన్ లైన్ లోనే రేషన్ అందిస్తున్నారు కాబట్టి, ఆయా రైస్ పాయింట్లకి వారికి ఎంత మంది అయితే రేషన్ తీసుకున్నారో అంతే రైస్ రేషన్ సరుకులు కేటాయిస్తారు. ఒకవేళ మీకు నచ్చని పాయింట్ నుంచి మీకు నచ్చిన పాయింట్ కు వెళ్లి రేషన్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.