ఈ లాక్ డౌన్ వేళ పేదలను ఆదుకున్నాయి రాష్ట్రాలు ..ముఖ్యంగా పని లేక జీతాలు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఈ సమయంలో వారికి ఆర్దికంగా తోడ్పాటు ఇచ్చి రేషన్ కూడా అందించింది ఏపీ సర్కార్, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇలా రేషన్ నగదు కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ కు ఇచ్చారు.
తాజాగా లాక్‌డౌన్ అమలు తరువాత ఆరో విడతగా తెల్ల రేషన్ కార్డుదారులకు గురువారం నుంచి ఉచితంగా బియ్యం, శనగలు అందజేయనున్నారు. రూ.10కి అర కిలో పంచదార ఇస్తారు. మరోసారి ఇలా రేషన్ ఇవ్వడంపై జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ డిపోలలో శానిటైజర్ వినియోగించాలి, మాస్క్ ధరించిన వారికి ఇవ్వాలి, భౌతిక దూరం తప్పక పాటించాలి…వేలిముద్రల ద్వారా బియ్యం పంపిణీ చేస్తారు, వైట్ కార్డ్ ఉన్న వారు అందరూ రేషన్ తెచ్చుకోవచ్చు.