మొత్తానికి అనుకున్నది సాధించిన రవిప్రకాశ్..?

మొత్తానికి అనుకున్నది సాధించిన రవిప్రకాశ్..?

0
89

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తన పంతం నెరవేర్చుకున్నారు. మొత్తానికి అనుకున్నది సాధించుకున్నారు. ఓ మీడియా అధిపతిగా పేరు సంపాదించిన ఆయన అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఎట్టకేలకు ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది.

తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్ కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇది నిజంగా రవిప్రకాశ్ కు శుభవార్తే.. దీని కోసం ఆయన కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. అరెస్టు కాకుండా చాలా ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధించారు.

టీవీ9 ను కొనుగోలు చేసిన అలంద మీడియా సంస్థ చేసిన ఫిర్యాదుతో రవిప్రకాశ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఫోర్జరీతో సహా అనేక అభియోగాలు రవిప్రకాశ్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో రవిప్రకాశ్ కు మొదట్లో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి.

కానీ మొత్తానికి రవిప్రకాశ్ అరెస్టు కాకుండా మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందగలిగారు. అయితే నిర్ణీత సమయాల్లో పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని, విదేశాలకు వెళ్లరాదని తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్ కు స్పష్టం చేసింది.