రైతు భరోసా కేంద్రానికి కూడా వైసీపీ రంగులు…

రైతు భరోసా కేంద్రానికి కూడా వైసీపీ రంగులు...

0
103

గ్రామ సచివలాయలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ రంగులు వేయడంపై ఇటీవలే హైకోర్టు అభ్యంతరం చెప్పినా సంగతి తెలిసిందే… వాటి స్థానంలో వేరే రంగులు వేయాలని సూచించింది… అయితే తాజాగా సర్కార్ పరిపాలన సౌలభ్యం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది…. అందులో భాగంగానే పుట్టపర్తి యెనుముల గ్రామంలో రైతు భరోసా కేంద్రంగా ఏర్పాటు చేసిన భవనానికి వైసీపీ రంగులు వేశారు… ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయరాదని కోర్టు చెప్పినప్పటికీ… తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులు వేయడాన్ని అందరినీ అర్చర్యాన్ని కలిగిస్తుంది… కాగా గతంలో ఈ భవనం వ్యసాయ గిడ్డంగి భవనం గా ఉండేది… ప్రస్తుతం రైతు భరోసా కేంద్రంగా ఏర్పాటు చేశారు….