ఆర్బీఐ సరికొత్త యాప్ ఎవరి కోసమో చూడండి

ఆర్బీఐ సరికొత్త యాప్ ఎవరి కోసమో చూడండి

0
87

కంటి చూపు సరిగ్గా లేని వారి కోసం కరెన్సీ నోట్లను గుర్తించేందుకు కూడా ఆర్బీఐ చాలా జాగ్రత్తలు తీసుకుని నోట్లను ముద్రిస్తుంది, వాటిలో ఉన్న కొన్ని

ప్రత్యేకమైన ఫీచర్లు అంధులు కూడా గుర్తిస్తారు. తాజాగా కంటి చూపు సరిగా లేని వారి కోసం కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా, ఆర్బీఐ సరికొత్త

సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇది సరికొత్త యాప్ దీని పేరు ఎంఏఎన్ ఐ .. ఈ పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్ ను ఆర్బీఐ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కంటి చూపు సరిగా లేని వారు సైతం కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు.. ఆండ్రాయిడ్ ఐ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఇది డౌన్ లోడ్ చేసుకుంటే ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది.

మీ మొబైల్ కెమెరాలతో ఆ యాప్ యాక్సెస్ అవుతుంది.. ఈ యాప్ ద్వారా మీరు క్యాష్ పై పెట్టగానే అది కెమెరాతో స్కాన్ చేసి వాయిస్ రూపంలో అది ఎంత విలువైన కరెన్సీనో చెబుతుంది.. 2016లో కొత్త కరెన్సీని తీసుకువచ్చింది ప్రభుత్వం.. రూ.10 రూ.20 రూ.50 రూ.100 రూ.200 రూ.500 రూ.2000 నోట్లను విడుదల చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించేందుకు అంధులకు ఇబ్బంది గా మారిందనే వాదనలు వినిపిస్తున్నకారణంగా ఆర్బీఐ ఈ కొత్త యాప్ రూపొందించింది.