చాలా మంది కారు పైనా బైకు పైనా కులం పేర్లు రాస్తూ ఉంటారు.. అద్దాలపై కూడా రాస్తూ ఉంటారు.. అయితే ఇలాంటి పోకడలు యూపీలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి… 20 వాహనాల్లో కచ్చితంగా ఒక వాహనంపై ఇలా కులాల పేర్లు రాస్తున్నారు.. దీంతో ఇక్కడ యూపీలో ఇలా కులం పేర్లను కారు అద్దాలపై, నంబర్ ప్లేట్లపై రాస్తే కఠిన చర్యలు తప్పవని
యోగి ప్రభుత్వం ప్రకటించిది. కొంతమంది ఇవి తొలగించడం లేదు..తాజాగా ఫైన్లు వేశారు అధికారులు.
ఓ వ్యక్తి తన కారు వెనుక అద్దాలపై కులం పేరును రాసుకున్నాడు. అది గమనించిన పోలీసులు సదరు కారు వ్యక్తిని ఆపి ఫైన్ వేశారు … లక్నోలో ఓ కారు వెనుక అద్దంపై సక్సేనా జీ అని రాసి ఉంది దీంతో అతనికి ఛలాన్ విధించారు.
యూపీలో ములాయం సింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్వాదీ అధికారంలో ఉన్న సమయంలో చాలా వాహనాలపై యాదవ్ అనే స్టిక్కర్లు కనిపించేవి. ఇక యూపీలో మాయవతి అధికారంలో ఉన్న సమయంలో జాతవ్ అనే కులం పేరుతో కూడిన స్టిక్కర్లను పెట్టుకున్నారు, అయితే ఇది మంచిది కాదు అని కులాల పోకడలు సరైనవి కాదని దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు…ఇలా ఎవరైనా వాహానాలపై కులాల పేర్లు పెడితే కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు అధికారులు.