ఎన్టీఆర్ ఎందుకు శాసనమండలి రద్దు చేశారు ఆరోజు జరిగిన దారుణం ఏమిటి

ఎన్టీఆర్ ఎందుకు శాసనమండలి రద్దు చేశారు ఆరోజు జరిగిన దారుణం ఏమిటి

0
131

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించి అధికారంలోకి వచ్చిన సమయంలో శాసనసభలో ఆయనకు తిరుగులేదు కాని అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మండలిలో మాత్రం మెజార్టీతో ఉంది, దీంతో ఎన్టీఆర్ వెంటనే కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని అనుకున్నారు. మండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ భావించారు.

కాని కేంద్రంలో కూడా కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉంది. 1984లో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అప్పట్లో ప్రధానిగా ఇందిరాగాంధీ దీనిని పక్కనపెట్టేశారు. ఆమె ఎందుకు కావాలి అని కాంగ్రెస్ ని ఇరకాటంలో పెడుతుంది దీంతో ఎన్టీఆర్ కు షాక్ తగిలింది…ఇందిర హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు.

ఆయన ఎన్టీఆర్తో సఖ్యత కోరుకున్నారు. పైగా… రాష్ట్ర ప్రభుత్వమే వద్దనుకున్నాక కేంద్రం అడ్డుకోవడం ఎందుకని భావించారు. 1985 మేలో 3 రోజుల వ్యవధిలో మండలి రద్దుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఎన్టీఆర్ సంతోషం వెల్లిబుచ్చారు, రాష్ట్రపతి సంతకం కూడా పూర్తయింది. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి త్వరితగతిన ఆమోదముద్ర పడేలా పలువురు రాజ్యాంగ నిపుణులు లాబీయింగ్ చేసినట్లు చెబుతారు. అయితే దీనికి పూర్తి సహకారం రాజీవ్ చేశారు, లేకపోతే అప్పుడు అయ్యేది కాదు.