రికార్డ్ – ఏకంగా 8 ల‌క్ష‌ల మంది విద్యార్దులు ఫెయిల్

రికార్డ్ - ఏకంగా 8 ల‌క్ష‌ల మంది విద్యార్దులు ఫెయిల్

0
93

మ‌నం తెలుగు బాగానే మాట్లాడ‌తాం, అయితే తెలుగు రాయ‌డం చ‌ద‌వ‌డం మాట్లాడటం వ‌చ్చు కాబ‌ట్టి తెలుగు ప‌రీక్ష కూడా బాగానే రాస్తాం అని పాస్ అవుతాం అని తెలిసిందే, ఎక్క‌డో కొంద‌రు మాత్ర‌మే తెలుగు ఫెయిల్ అయ్యేవారు ఉంటారు.

కాని మ‌న దేశంలో హిందీ ఎక్కువ‌గా మాట్లాడుతారు.హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ నంబర్‌ వన్ స్థానంలో ఉంది. కాని ఇక్క‌డ బోర్డ్ ఎగ్జామ్స్ అదే 10 అలాగే 12 త‌ర‌గ‌తుల వారు అస‌లు హిందీ ఇష్ట‌ప‌డ‌టం లేదేమో అంటున్నారు విద్యావేత్త‌లు.

ఎందుకు కార‌ణం అంటే తాజాగా వెలువడిన యూపీ బోర్డు పరీక్షల ఫలితాల్లో ఆ రెండు తరగతులకు చెందిన మొత్తం 8 లక్షల మంది విద్యార్థులు హిందీ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారు. ఇలా ఫెయిల్ అవ్వ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. హిందీ స్టేట్ లో హిందీ ఫెయిల్ అవ్వ‌డం ఏమిటి అని అంద‌రూ ఆశ్చర్య‌పోతున్నారు.యూపీలో 10, 12 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించగా మొత్తం కలిపి 59.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.