గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో చాలా తక్కువగా ఓటింగ్ జరిగింది అని అందరూ అనుకున్నారు, 70 లేదా అరవై శాతం జరుగుతుంది అని భావించినా ఓటరు ముందుకు రాలేదు, అయితే తాజాగా ఫైనల్ ఓటింగ్ శాతాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు.
ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే 20 ఏళ్లలో ఈసారే బాగా ఓటింగ్ జరిగింది.
గ్రేటర్లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి 46.68 ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు, ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ ఓటింగ్ జరిగింది.
2009 ఎన్నికల్లో 42.04 శాతం, 2016లో 45.29 శాతం ఓటింగ్ నమోదు అయింది.. ఈసారి ఎన్నికల్లో 46.68 శాతం నమోదు అయింది.. 1.31 శాతం పోలింగ్ ఈసారి పెరిగింది, కంచన్బాగ్లో అత్యధికంగా 70.39 శాతం ఇదే అత్యధికంగా నమోదు అయింది, ఇక అత్యల్పంగా 32.99 శాతం యూసఫ్గూడలో నమోదు అయింది. ఈసారి ఇవే రికార్డు క్రియేట్ చేశాయి. గ్రేటర్ లో 150 డివిజన్లు మొత్తం, ఇక డిసెంబరు 4 న ఫలితాలు రానున్నాయి.