రికార్డ్ స్థాయిలో బంగారం ఎంత పెరిగిందంటే…

రికార్డ్ స్థాయిలో బంగారం ఎంత పెరిగిందంటే...

0
95

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సైంజ్ లో బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా రికార్డ్ స్థాయిని అందుకుంది… నేటీ ఉదయం 10 గంటలకు 10 గ్రాములు బంగారం ధర 67లు పెరిగి 48829 వద్ద ట్రేడ్ అవుతోంది… ఈ ధర బంగారానికి సరికొత్త రికార్డ్ స్ధాయి కావడం విశేషం…

అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టన్ని అందుకోవడంతో పాటు జాతీయ అంతర్జాతీయంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు.. రానున్న రోజుల్లో బంగారం ధర 49050,49230 స్థాయిలో కీలక నిరోధాన్ని ఎదుర్కోవచ్చని వారు అంచనా వేస్తున్నారు…

నిన్నటిరోజు ట్రేడింగ్ 48825 వద్ద కొత్త రికార్డ్ స్థాయిని నమోదు చేసింది… చివరికి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి 518 లాభంతో 48762 వద్ద స్థిరపడింది… అంతర్జాతీయంగా 8ఏళ్ల గరిష్టానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 8ఏళ్ల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది… ఉదయం ఆసియాలో బంగారం ధర 1 డాలర్ స్వల్పలాభంతో 1,801వద్ద ట్రేడ్ అవుతోంది…