నాలుగు రోజులుగా స్దిరంగా ఉన్న బంగారం ధర నేడు మళ్లీ తగ్గుముఖం పట్టింది, బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది, అలాగే
వెండి ధర కూడా మార్కెట్లో భారీగా తగ్గింది, మరి నేడు పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం, ఇక గడిచిన రెండు నెలలుగా చూస్తే మార్చి నెలలో భారీగా తగ్గాయి వెండి బంగారం ధరలు.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గింది. దీంతో రేటు రూ.45,880కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.. రూ.190 తగ్గడంతో రూ.42,050కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.
బంగారం ధర తగ్గితే వెండి ధర భారీగా తగ్గింది…ఏకంగా రూ.1,800 తగ్గుదలతో రూ.70,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం పైగా కొనుగోళ్లు పెద్ద లేకపోవడం ఇలా వెండి రేటు తగ్గడానికి కారణం అంటున్నారు.