రిలయన్స్ జియో మరో బిగ్ డీల్….

రిలయన్స్ జియో మరో బిగ్ డీల్....

0
87

రిలయన్స్ జియోలో దాదాపు 25.09 శాతం వాటాలను విక్రయిస్తూ రిలయన్స్ చేసుకొన్న డీల్స్ వేగంగా అమల్లోకి వస్తున్నాయి ఇప్పటికే వీటిల్లోనాలుగు డీల్స్ నుంచి 30,062 కోట్లు అందినట్లు ఆ సంస్థ నిన్న సెబీకి అందజేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్ లో పేర్కొంది…

దాదాపు 6.13 శాతం విలువైన వాటాలకు సంబంధించి ఎల్ కాటర్టన్ దీ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సిల్వర్ లేక్ జనరల్ అట్లాంటిక్ వంటి సంస్థలతో కుదుర్చుకొన్న ఒప్పందాలు పూర్తయినట్లు ఈ ఫైలింగ్ లో వెల్లడించింది… అంతకు ముందు కూడా ఫేస్ బుక్ తో డీల్ పూర్తి కావడంతో 43574 కోట్లను రిలయన్స్ అందుకొంది…

అప్పట్లో ఫేస్ బుక్ చెందిన జాద్దూ హోల్డింగ్స్ కు 9.99 శాతం వాటాను కేటాయించినట్లు జూలై 7 నాటి రెగ్యూలేటర్ ఫైలింగ్ లో వెళ్లడించింది…రిలయన్స్ జియోలో మొత్తం 25.09 వాటాను 11 మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది… ఈ డీల్స్ విలువ 1,17,588,.45 కోట్లు…