BIG BREAKING: సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల

0
68

సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే ఈ టెస్టులో నార్మల్ వచ్చినట్లు, ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. కేసీఆర్ కు అన్ని రకాల వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఆయన ఆరోగ్యం నార్మల్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు డాక్టర్లు.

ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ..సీఎం గారు కొద్దిరోజులుగా నీరసంగా ఉన్నారు. అలాగే రెండు రోజుల నుండి ఎడమ చేయి లాగుతుందని చెప్పారు. దానికి సంబంధించి వైద్యపరీక్షలు నిర్వహించాం. యాంజియోగ్రామ్ టెస్టులో ఎలాంటి బ్లాక్స్ లేవు. దానితో పాటు మిగతావన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి. అయితే ఎడమ చేయి లాగడానికి సంబంధించి పరీక్షలు కూడా చేశాం. బ్రెయిన్ mri టెస్ట్ చేశాం. నీరసంగా ఉండడానికి కారణం విశ్రాంతి లేకపోవడం. అందుకే 10 రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించాం. సీఎం కేసీఆర్ ను డిశ్చార్జి చేస్తాం. సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికెళ్తారని తెలిపారు.