ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్..సంస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఆయన మార్క్ చూపుతూ..ఆర్టీసీని పండుగ పూట లాభాల్లోకి తెచ్చారు. ఏటా పండుగ వేళ ఆర్టీసీకి లాభాలు వస్తున్నా కూడా… ఈసారి మరింత ప్లానింగ్ తో ఆర్టీసీకి లాభాల శాతాన్ని పెంచారు సజ్జనార్.
అవసరాన్ని బట్టి ఉద్యోగుల సంఖ్య పెంచుతాం.. లేదా తగ్గిస్తాం అని గతంలో చెప్పిన సజ్జనార్.. అన్న మాట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఐటీఐ డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ గ్రాడ్యుయేట్స్ కావలెను అంటూ ఓ ప్రకటన చేశారు.
హైదరాబాద్ రీజియన్ లోని 17 ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ చేయటానికి ఖాళీలున్నాయని సజ్జనార్ తెలిపారు. ఎంపికైన వారికి.. అప్రెంటిస్‌షిప్ టైంలో బస్ పాస్, స్టైపెండ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ టేడ్స్ లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్ సంప్రదించాలని కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే
1. 73828 14709
2. 93911 62327
3. 73828 22783