దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. జూన్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, జులై 2న నామినేషన్ల ఉపసంహరణ తేదీని ఖరారు చేసింది.
అలాగే రాష్ట్రపతి ఎన్నికకు జులై 18వ తేదీన పోలింగ్, జులై 21న ఫలితాల విడుదల, జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24వ తేదీన ముగియనుంది. దీంతో పార్లమెంట్‌లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరగనుంది.