4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

0
106

ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను జారీ చేసింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. మొత్తం 38 ఉద్యోగాలు భర్తీకి ప్రకటన జారీ చేసింది. సమాచార శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ షిప్ అధికారులు -6, ఆర్థిక గణాంక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు- 29, వైద్య ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారి – 1, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో హాస్టల్ వార్డెన్ -02 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.

నోటిఫికేషన్​లోని పూర్తి వివరాల కోసం ఎపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్​ను సందర్శించాలని వెల్లడించారు. అలాగే ఏపీ పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది.