తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

0
46

ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఎలక్షన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతపురం 1, కృష్ణా 2, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, విజయనగరం 1, విశాఖపట్నం 2, చిత్తూరు 1, ప్రకాశం 1 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 16న విడుదల కానుండగా.. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అలాగే నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.