మన దేశంలో రిలయన్స్ కంపెనీ దూసుకుపోతోంది జియో తో సరికొత్త రికార్డు నెలకొల్పారు ముఖేష్ అంబానీ, కోట్లాది మందికి దగ్గర అయింది కంపెనీ, అయితే జియో రాకతో ఎక్కడో ఉన్న డేటా రేట్లు ప్లాన్లు అన్నీ ఫట్ మని తగ్గిపోయాయి, జియోతో మిగిలిన కంపెనీలు పోటీ పడలేని స్దితి ఇప్పుడు ఉంది.
తాజాగా రిలయన్స్ సంస్థ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. భారత్లో త్వరలోనే 5జీ నెట్వర్క్ ప్రారంభం కాబోతుండగా.. ఇప్పటికే 5జీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. కాని సామాన్యులు ఇవి కొనాలి అంటే మినిమం 25 వేలు ధర ఉంది, ఈ సమయంలో రిలయన్స్ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు 5జీ మొబైల్ను అందించడానికి సిద్ధం అవుతోంది. వచ్చే రోజుల్లో 5 జీ మొబైల్ ఫోన్ను లాంచ్ చేస్తామని ప్రకటించింది. డిమాండ్ను బట్టి జియో 5జీ మొబైల్ ధర రూ.2,500 నుంచి 3 వేల రూపాయల వరకు ఉండొచ్చని కంపెనీ తెలిపింది, ఈ ధరకు మార్కెట్లోకి ఫోన్ వస్తే ఇక చాలా వరకూ మిగిలిన కంపెనీలకు కష్టమే అంటున్నారు అనలిస్టులు.