రోజుకి రూపాయికి 1 జీబీ డేటా ఈ కొత్త కంపెనీ ఆఫర్ తప్పక తెలుసుకోండి

రోజుకి రూపాయికి 1 జీబీ డేటా ఈ కొత్త కంపెనీ ఆఫర్ తప్పక తెలుసుకోండి

0
82

టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో ఓ సంచలనం.. ఈ కంపెనీ రాకతో చాలా వరకూ అన్ని కంపెనీలు తమ వ్యాపారాలను కోల్పోయాయి, మార్కెట్లో వారి ఉనికి లేదు అనే చెప్పాలి, అసలు డేటా వినియోగంలో కూడా జియో రావడం వల్లే ఇంత వేగం పెరిగింది అని చెబుతున్నారు అందరూ..అయితే, జియో సైతం షేక్ అయ్యే ప్లాన్తో మార్కెట్లోకి వచ్చింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ వైఫై డబ్బా.

మొబైల్ ఫోన్ వినియోగదారులకు కేవలం రూ.1 కే.. ఒక జీబీ డేటాను అందించనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. వైఫై డబ్బా సీఈవో కంరం లక్ష్మణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు, మన దేశంలో ఎవరూ ఇవ్వని ఇంత కారుచౌక డేటా అని అందరూ చెబుతున్నారు, దీనికి మౌత్ పబ్లిసిటీ కూడా బాగా పెరిగిపోయింది.

మొబైల్ ఫోన్లలో ఓటీపీ ఎంటర్ చేయడంతో వైఫై డబ్బాకు ఎవరైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. టీ షాపులు, వ్యాపార కూడళ్లలో ప్రీపెయిడ్ కూపన్ల ద్వారా కూడా డేటా సేవలను పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇది జియోకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందంటున్నారు… 2017 నుంచి ఈ కంపెనీ డేటా సేవలు అందిస్తోంది, గతంలో ఇరవై రూపాయలకు ఒక జీబీ డేటా ఇచ్చేది ఇప్పుడు రూపాయికి ఒక జీబీ డేటా ఇస్తున్నారు.