రేపు వైసీపీలోకి శిద్దా రాఘవరావు

రేపు వైసీపీలోకి శిద్దా రాఘవరావు

0
101

తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక తమకు భవిష్యత్ లేదు అని చాలా మంది నేతలు ఆలోచన చేస్తున్నారు, అందుకే వైసీపీలో చేరుతున్నారు, తాజాగా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీలోకి పలువురు టీడీపీ నేతలు చేరిన విషయం తెలిసిందే, తాజాగా ప్రకాశం జిల్లా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరబోతున్నారు.

ఇప్పటికే జిల్లా నుంచి కరణం కుటుంబం వైసీపీలో చేరింది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బలరాం వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆయన అనధికారికంగా వైసీపీలో ఉన్నట్టే లెక్క. ఇక తాజాగా
మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తన కుమారుడితో కలిసి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.

శిద్దా రాఘవరావు ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆయన మంత్రిగా పని చేశారు, ఈసారి ఒంగోలు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ది మాగుంట చేతిలో ఓటమిపాలయ్యారు, ఇప్పటికే శిద్దా సోదరులు వైసీపీలో ఉన్నారు. రేపు ఆయన వైసీపీలో చేరనున్నారట.