అక్టోబర్ నుంచి ధ‌ర‌ణి సేవ‌లు ఇక ఎమ్మార్వో ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు

అక్టోబర్ నుంచి ధ‌ర‌ణి సేవ‌లు ఇక ఎమ్మార్వో ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు

0
77

తెలంగాణ స‌ర్కారు తీసుకువ‌చ్చిన కొత్త రెవెన్యూ చ‌ట్టం సిద్దం అయింది, ఇక అక్టోబర్ మూడు నుండి తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రజలకి అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. డిజిటల్‌ సేవల పోర్టల్‌ ధరణి ని స్టార్ట్ చెయ్యాలని అధికారులు సిద్దం అవుతున్నారు.

దీని వ‌ల్ల ఎలాంటి రెవెన్యూ భూముల స‌మ‌స్య‌లు రావు, ప్ర‌భుత్వం కూడా అన్నీ ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది, అంతేకాదు రూ.10 లక్షలు ఒక్కో కార్యాలయానికి అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రూ.10 లక్షలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహించేందుకు సాంకేతిక, మౌలిక వసతుల కల్పన కింద అందజేయనున్నారు.

ఇక కంప్యూట‌ర్లు ప్రింట‌ర్లు స్టేష‌న‌రీ అన్నీ అందిస్తారు, ఇక వీఆర్వో వ్యవస్థ రద్దైన సంగతి తెలిసిందే.వారికి ఇంకా స‌ర్కారు శాఖ‌ల‌కి కేటాయించ‌లేదు, త్వ‌ర‌లో దీనిపై నిర్ణ‌యం తీసుకుంటారు.ఆస్తుల వివరాలను పదిహేను రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాలని, సీఎం ఆదేశాలను వెంటనే అనుసరించాలని క‌లెక్ట‌ర్ల‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.