Flash: విద్యార్థి – నిరుద్యోగ సైరన్ కు రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ ఇదే..!

Revant Reddy's big plan for student - unemployment siren

0
92

కేసీఆర్ పథకాలు పైన పటారం- లోన లోటారం అన్నట్లు ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రేవంత్ మాట్లాడుతూ..అమరుల త్యాగాలకు విలువ లేకుండా టీఆర్ఎస్ పాలన సాగుతోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించారు. డిసెంబర్ 9న విద్యార్థి యువజన భారీ కార్యక్రమం మలిదశ ఉద్యమానికి శ్రీకాంతాచారి మొదటి అమరుడయ్యారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4 వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఉమ్మడి అందించేందుకు ఫీజు రియంబర్స్ మెంట్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రేస్ తెచ్చింది. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల వల్ల వేలమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

బకాయిలు ఉన్న 4వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలి. నిరుద్యోగ భృతి ఇస్తారా? ఇవ్వరా అనేది స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది పట్టభద్రులు నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ 1లక్ష రూపాయలు భాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్- నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్ నియామకం పై పోరాటం చేస్తాం.

విద్యార్థి నిరుద్యోగ జంక్ సైరన్ కార్యక్రమం అనేది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తాం. దిల్ సుఖ్ నగర్ చౌరస్తా నుంచి పాదయాత్ర చేస్తూ ఎల్బీ నగర్ వరకు వెళతాం. తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలు ఆగాలంటే సోనియమ్మ రాజ్యం రావాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే ఇవ్వాళ తెలంగాణ అత్యధికంగా ప్రమాదంలో ఉంది.

హుజురాబాద్ ఎన్నికపై మాకు వ్యూహం ఉంది. హుజురాబాద్ అభ్యర్థి పై సీఎల్పీ నేతృత్వంలో కమిటీ ఉంది. రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుంది. హుజురాబాద్ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు. మాతో కలిసి వచ్చే పార్టీలను వ్యక్తులను కలుపుకుంటాం అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎంఐఎం బలం ఎంతో బీజేపీ బలం అంతే అని ఏకిపారేశారు.