గాంధీభవన్ లో రెండోరోజు సందడే సందడి

0
89

టిపిసిసి నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోరోజు కూడా గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది. గురువారం గాంధీ భవన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు కీలక సమావేశాలు జరిగాయి.

ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్సార్ 72వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మైనక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వివిధ విభాగాల చైర్మన్ లు, వర్కింగ్ ప్రసిడెంట్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

గాంధీభవన్ లో డిసిసి అధ్యక్షులతో రేవంత్ రెడ్డి

అనంతరం టీపీసీసీ తొలి కార్యవర్గ సమావేశాలు జరిగాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు తదితరులు పాల్గొని సమావేశాలు నిర్వహించారు.

ముందుగా వర్కింగ్ ప్రసిడెంట్లు గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, వివిధ కమిటీ ల చైర్మన్లు మధు యాష్కీ గౌడ్, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, అజ్మతుల్లా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

తర్వాత సీనియర్ ఉపాధ్యక్షులతో ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులతో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, చిన్నారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.