కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు అధికారిక గీతం, ప్రత్యేక జెండా..ప్రతిపాదనలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి

0
99

తెలంగాణ వచ్చాక ‘జయజయహే తెలంగాణ’ పాటను కాలగర్భంలో కాలగర్భంలో కలిపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో రేవంత్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ‘జయజయహే తెలంగాణ’ పాటను అధికారిక గీతంగా ఆమోదిస్తామని తెలిపారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కేసీఆర్ కావాలనే టిజి ని టీఎస్ గా తీసుకొచ్చారు. టిఆర్ఎస్ పేరుకు పర్యాయపదంగా దీనిని తెచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజీ చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు.

బీజేపీ, టిఆర్ఎస్ ను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనదే అన్నారు. ఆనాడు రాచరికపు పాలన నుండి ఫ్రీడమ్ ను అందించింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, టిఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.