నిజమేనా — రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎప్పుడు?

నిజమేనా -- రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎప్పుడు?

0
96

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్నారు, ముందు నుంచి దూకుడుగా ఉండటంతో పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు, ఇటు కేసీఆర్ సర్కారు పై టీఆర్ ఎస్ పై నిత్యం విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉంటారు ఆయన.

అయితే పీసీసీ చీఫ్ రేసులో కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి, ఇక ఎంపీగా ఓ రికార్డ్ అనే చెప్పాలి, అయితే రేవంత్ ను టీఆర్ ఎస్ కు బలమైన ప్రత్యర్దిగా కొందరు భావిస్తారు , పీసీసీ బాధ్యతలు ఆయనకు ఇస్తే కచ్చితంగా రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువస్తాడు అని భావించే వారు కొందరు ఉన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం 2021వరకు ఉంది కాబట్టి.. తర్వాత రేవంత్ ఆ రేసులో ఉంటారు అని కాంగ్రెస్ యువ నేతలు భావిస్తున్నారు..రెడ్డిలకు అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది, ఇక బీసీలకు ఇస్తే అంజన్ కుమార్ యాదవ్ కు.. ఎస్సీలకు ఇస్తే కొన్ని పేర్లు పరిశీలన చేస్తున్నారట, తనకు కాకపోయినా తన వారికి వచ్చినా హ్యాపీ అని ఆలోచన చేస్తున్నారట రేవంత్. ఇక ఆయన ఎన్నికల సమయానికి పాదయాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో తెలిసిందే, అందుకే రేవంత్ కూడా ఈ ఆలోచన చేస్తున్నారట.