మిమ్మల్ని కొజ్జాలు అనుకునే ప్రమాదం ఉంది..రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్

Ministers who went to Delhi are enjoying: Rewanth Reddy

0
121

గత మూడు నెలలుగా తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉంది పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ మోడీని కలవలేదు, రైతు సమస్య వివరించలేదు. కేటిఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడ్డి పెట్టి పంపించారని సెటైర్లు వేశారు.

వరంగల్ గోడౌన్ లోని 25 వేల మెట్రిక్ టన్నుల బొయ్యం గోల్ మాల్ పై కేంద్రం నిలదీస్తే దొంగళ్ల పారిపోయి వచ్చారు. సెంట్రల్ హాల్ లో ఫోటోలు దిగి పార్లమెంట్ లో ఆందోళన చేసినట్లు తప్పుదోవపట్టిస్తున్నారు. బీజేపీ ఛావుడప్పులో కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావ్ ఎందుకు పాల్గొనలేదు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. ఖరీఫ్ పంట టార్గెట్ పూర్తిగా ఎందుకు సరఫరా చేయలేదో రైతులకు, కేంద్రానికి రాష్ట్రం చెప్పాలి.

ఎంత సరఫరా చేస్తారో చెప్పకుండా అదనపు పంట కొంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనడం హాస్యాస్పదం. యాసంగి పంట గురించి ఎందుకు నిలదీయడం లేదు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్ రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారు. ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారు. గోవాలో ఉన్నారా, దుబాయ్ లో ఉన్నారా మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందంలో సంతోష్ రావు ఎందుకు లేరు.

ఖరీఫ్ లో ఎంత కొంటారో చెప్పే వరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పే వరకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి. ఏది తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే మిమ్మల్ని ఆడంగులు, కొజ్జాలు అనాల్సి వస్తుంది. మీకు గాజులు, చీరలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రజల్ని మభ్యపెట్టడానికి వీధినాటకాలకు తెరలేపారా అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

రైతులు ఎవరూ చనిపోవద్దు, కాంగ్రెస్ రైతులకు అండగా ఉంటుంది. డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తాం. రైతులంతా ఎర్రవెల్లికి రావాలి. టీపీసీసీ ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.