రేవంత్‌ తప్పు చేశారు- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

0
115

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఓ వైపు వలసల పర్వం కొనసాగుతుండగా..తాజా చేరిక ఇప్పుడు కాంగ్రెస్ ను టెన్షన్ పెట్టిస్తుంది. నేడు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ చేరికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి భగ్గుమన్నారు. నన్ను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీలో ఎలా చేర్చుకుంటారు.. రేవంత్‌ రెడ్డి తప్పు చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడు వెళ్తా అని ఆయన పేర్కొన్నారు.

వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అద్దంకి దయాకర్ ను ఓడగొట్టి , కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన వడ్డేపల్లి రవికి మాత్రం నువ్వు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించవచ్చు కానీ..తెలంగాణ ఉద్యమంలో పీడి ఆక్ట్ ఎదుర్కొని, అనేక ఇబ్బందులకు గురై కూడా ప్రజల పక్షాన తన గొంతును వినిపిస్తున్న చెరుకు సుధాకర్ మాత్రం పార్టీలోకి రావద్దు అంతేనా వెంకన్న అని ప్రశ్నించారు.