తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించ తలపెట్టిన ‘రెవిన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సిఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధిచిన తేదీలను వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.