ప్రధాని వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి సీరియస్‌..మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేయాలని పిలుపు

Rewant Reddy is serious about the Prime Minister's remarks..Call calling for burning of Modi effigy

0
79

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ, విభజనపై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా.. దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేయాలని పిలుపునిచ్చారు. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను కాంగ్రెస్‌ నేతలు దహనం చేయనున్నారు.

రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి సరైందిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఫైర్ అయ్యారు. కనీసం చర్చ కూడా జరుగకుండా.. విభజన బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.