నల్లగొండ జిల్లా పర్యటనలో రేవంత్ రెడ్డి..

0
118

నల్గొండ జిల్లా పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రైతులు మోర పెట్టుకున్నారు. కేసీఆర్ మమ్మల్ని నిరంతరం మోసం చేస్తున్నారంటూ వాపోయారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ కేవలం అవన్నీ వుట్టి పుకార్లే అని రేవంత్ రెడ్డితో రైతులు చెప్పుకోసాగారు.
కేసీఆర్ లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తాననిచెప్పి ఏమి చేయలేదని తెలిపారు.

మేము రెయ్యిబవళ్ళు కష్టపడి పండించిన వరి వేస్తే ధాన్యం కొనకుండా మమ్మల్ని నష్టం చేసాడని చెప్పారు. అంతేకాకుండా నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై మరింత వేశారని స్పష్టం చేసారు. రైతుల సమస్యల పరిష్కారానికి 6వ తేదీన వరంగల్ లో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేశామని రైతులకు రేవంత్ రెడ్డి తెలిపారు.

అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు. ఇద్దరు కలిసి రైతులను నిండా ముంచారు. కేసీఆర్ ను నమ్ముకొని వరి వేసిన రైతులు నిండా నష్టపోయారని తెలిపారు. 6వ తేదీ రాహుల్ సభకు ప్రతి రైతు ఇంటి నుంచి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయాలనీ కోరారు. అంతేకాకుండా ప్రజలకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.