Breaking: మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..ఆ మంత్రులపై చర్యలు తీసుకోండి

Rewanth Reddy open letter to Minister KTR

0
49

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై, ప్రజా ప్రతినిధుల అవినీతిపై తన గళం వినిపిస్తున్నారు.

తాజాగా తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాదు అక్రమ కట్టడాలకు సంబంధించి ఆధారాల లేఖను జత చేశారు.. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారు.

టిఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదు. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవు. టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు. మీకుచేతకాకననా.. లేక అందులో మీకు వాటాలు ఉన్నాయా.. ? జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేసి అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారు.. ఇది అంత ఆషామాషీ విషయమా ?

ఫీర్జాది గూడలో మీ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారు. దేవర యాంజల్ 437 సర్వే నెంబర్ లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పత్రికలు నడుపుతున్నారు. ఇలాంటి గ్రేటర్ లో మీ నాయకులు చేసిన కబ్జాలు కోకొల్లలు. అనేక అక్రమాలకు సంబంధించి పత్రికలలో పతాక శీర్షికలు వచ్చాయి. ఈ విషయాలు మీరు మునిసిపల్ శాఖ మంత్రిగా స్పందించి చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయించాలి. లేకపోతే కాంగ్రెస్ పక్షాన మేమే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.