తెలంగాణ: గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ..కొత్త సంవత్సరంలో తెలంగాణలో విధి బాగోతం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి కార్యాచరణ ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్థానికత ఆధారంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి స్థానికత కల్పించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 371డి ఆర్టికల్ ను తీసుకొచ్చింది. 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉంది. దీని ద్వారా స్థానికత కోల్పోయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీ చేస్తే ఆయనకు ఉద్యోగులు వ్యతిరేకంగా పని చేస్తారని 317 జీవో తెచ్చారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ లో దీక్ష ఎలా చేస్తారు. కాంప్ ఆఫీస్ అంటే ఇల్లు లాంటిదన్నారు.
జాతరలో గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు దేశం నలుమూలల నుండి బీజేపీ వాళ్ళు వస్తున్నారు. రాష్ట్రం పంపించిన ఉత్తర్వులను ఆమోదించిందే కేంద్ర ప్రభుత్వం. దానిని రాష్ట్రపతి ఆమోదించారు. 317జీవో విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది. జీవో సవరణలు చేయాలనుకుంటే ఒక్క కలం పోటుతో కేంద్ర ప్రభుత్వం సవరణ చేయవచ్చు. కేసీఆర్ వామపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ఏతర పక్షాలను కలుపుకొని కూటమి కడదాం అంటున్నాడు. కేసీఆర్ నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు. జగన్మోహన్ రెడ్డి, నవిన్ పట్నాయక్ దగ్గరికి కూటమి కడదామని వెళ్ళవా..యూపీఏలో ఉన్న డీఎంకే ,శరత్ పవర్, కమ్మునిస్ట్ లను కలుస్తున్నావ్ కాంగ్రెస్ ను బలహీన పర్చడానికి సుఫారీ తీసుకున్నావ్.
యూపీలో అఖిలేష్ యాదవ్ ని గెలిపించడానికి మద్దతు ఇస్తున్నవా కేసీఆర్ చెప్పాలి.అక్కడ వామపక్షాలు మద్దతు ఇస్తున్నామని చెప్పాయి. యోగిని దింపడానికి నువ్వు ప్రచారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవా చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలహీనపర్చడానికి టిఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకం. మోదీ ఇచ్చిన ఎజెండాని కేసీఆర్ అమలు చేస్తున్నారు. నరేంద్రమోదీ, బండి సంజయ్ దేశభక్తి బీరకాయలో నెయ్యంత మెడిన్ ఇండియా, మేకిన్ ఇండియా అని చెప్పుకునే బీజేపీ సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని చైనాలో తయారు చేసి గుజరాత్ లో పెట్టారు. ముచ్చింతల్ లో రామనుజాచార్యా విగ్రహాన్ని ప్రధాని అవిష్కరిస్తుండడంతో రామేశ్వర్ రావు సమీక్షకి కేసీఆర్, మంత్రులు, కేబినెట్ వెళ్లడం ఏంది. రామనుజాచార్యా విగ్రహం కూడా చైనా లోనే తయారైంది. 50 యాప్ లను నిషేధించమని చెప్పుకుంటున్న బీజేపీ నిజమైన దేశభక్తి ఉంటే చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహం ప్రారంభానికి ప్రధాని ఎలా వస్తారని ప్రశ్నించారు.
ఇందిరాగాంధీ తో కేసీఆర్ ని పోల్చడం ద్వార హేమంత్ బిస్వాస్ క్షమించరాని నేరం చేశారు. ఇందిరాగాంధీ పేరు ఎత్తే అర్హత బీజేపీ నేతలకు లేదు. మీకు చేతనైతే 317 జీవోని వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ, పీఏసీ కన్వీనర్, మహేశ్వర్ రెడ్డి ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, అంజన్ కుమార్ యాదవ్ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ, మల్లు రవి సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.