Breaking- రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

Rewanth Reddy sensational tweet

0
87

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసిన జైలుకు పంపించారు. దీనిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు.

తెలంగాణ బీజేపీ, టిఆర్ఎస్ ఆడుతున్న నాటకం రక్తి కడుతుంది. బండి సంజయ్ ఆఫీస్ లో దీక్ష చేస్తే ఇనుపకంచెలు కోసి 14 రోజులు రిమాండ్ లో పెట్టడం, నడ్డాని అరెస్ట్ చేస్తారనడం లోపాయకారి ఒప్పందం లో భాగమే. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని కేసీఆర్, టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పార్ట్-1: బండి సంజయ్ అరెస్ట్.

పార్ట్-2: JP నడ్డాను ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.

తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూపించడానికే ఇదంతా?

ఇప్పుడు దీన్ని బహిర్గతం చేసాము ఇప్పుడు డ్రామా ఎలా జరుగుతుందో చూద్దాం..అంటూ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

https://twitter.com/revanth_anumula