బోయిగూడ అగ్నిప్రమాదంపై రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి..విచారణ జరపాలని డిమాండ్

0
95

బోయిగూడ సంఘటన పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తుక్కు పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. అగ్నిప్రమాదం పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చెపట్టాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.