బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి పరామర్శ..జీవో 317కు వ్యతిరేకంగా పోరాటం..

Rewanth Reddy visits the families of the victims .. Fighting against Jivo 317 ..

0
105

నేడు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు జేత్రామ్​ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పరామర్శించారు. అనంతరం పర్వతగిరిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు సంపత్​ కుటుంబాన్ని పరామర్శించారు. చనిపోయిన ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలి. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందించే బాధ్యత బీజేపీ తీసుకోవాలని పిసిసి చీఫ్ కోరారు.

జీవో 317 వల్ల స్థానికతపై గందరగోళం నెలకొందన్నారు. కావాలానే తెరాస, భాజపా సమస్యను జటిలం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జీవో 317కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో  కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలమంతా జీవో 317 అంశంపై ప్రస్తావిస్తామని వెల్లడించారు.

ఓట్లేసిన ప్రజలను నమ్ముకుని కాకుండా.. పోలీసులను నమ్ముకుని తెరాస ప్రభుత్వం పరిపాలన చేస్తోంది. జీవో 317 ప్రవేశపెట్టి.. ఉపాధ్యాయ ఉద్యోగులను వేరే వేరే జిల్లాలకు బదిలీలు చేసి వారికి స్థానికత అనేది లేకుండా చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేసి వ్యవహరిస్తున్నాయి. జీవో 317పై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావన తెస్తా. అసెంబ్లీలో ఈ సమస్యపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పోరాడతారని స్పష్టం చేశారు.