రేవంత్ Vs ఎర్రబెల్లి..కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

0
107

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోగా..ఇప్పుడు అతని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు నర్సంపేట వెళుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఘట్ కేసర్ టోల్ ప్లాజా దగ్గర రేవంత్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయాలని, వచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కోసం ఉద్యమం చేయాలా..? అని ఆమె మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేశాయని, ఇప్పుడు కేసీఆర్‌ చేష్టలు. కాంగ్రెస్ నీ అధికారంలోకి తెస్తాయని ఆమె తెలిపారు.

కొండా సినిమాని ఎర్రబెల్లి అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. రేవంత్ రాకుండా అడ్డుకుంటున్నారని, రేవంత్ వస్తే ఎర్రబెల్లి బండారం బయట పెడతారు అని భయం అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి నీ తిట్టాలంటే వరంగల్‌కే రావాలా..? హైదరాబాద్ లో ఉండి తిట్టడకూడదా ? అంటూ ఆమె చురకలు అంటించారు.