పవన్ పై భీమవరం నుంచి పోటీ చేస్తున్నా వర్మసంచలన ప్రకటన

పవన్ పై భీమవరం నుంచి పోటీ చేస్తున్నా వర్మసంచలన ప్రకటన

0
114

రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడు.. ఆయన ఏం చేసినా సంచలనమే, తాజాగా ఓ ట్వీట్ పెట్టి అందరి దృష్టి మళ్లీ తనవైపు తిప్పుకున్నాడు. రెండు రోజుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో మరో హైప్ క్రియేట్ చేశారు ఆయన. తాజాగా తాను భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ ప్రకటన చేశారు.. అది కూడా ట్విట్టర్లో. అయితే నామినేషన్లకు సమయం అయిపోయింది. మరి వర్మ ఇప్పుడు ఇలాంటి ప్రకటన చేయడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు నామినేషన్లకు సమయం అయిపోయింది అని నాకు తెలుసు, కాని నాకు స్పెషల్ పర్మిషన్ ఉంది అని చెబుతున్నారు వర్మ, మరి ఆయన స్పెషల్ పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు, అసలు ఇలా గడువు అయిన తర్వాత నామినేషన్ వేసే అవకాశం ఉందా అంటే లేదు అంటున్నారు అధికారులు. మరి వర్మ ఎందుకు ఇలాంటి టార్గెట్ పెట్టారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.