ఆర్జీవీకి కేటీఆర్ పంచ్ ట్వీట్‌…. స‌ర‌దాగా

ఆర్జీవీకి కేటీఆర్ పంచ్ ట్వీట్‌.... స‌ర‌దాగా

0
126

రామ్ గోపాల్ వ‌ర్మ ఏ విషయం పై అయినా విభిన్నంగా స్పందిస్తారు, సోష‌ల్ మీడియాలో ఆయన ట్వీట్స్ అలాగే ఉంటాయి, ఇక తాజాగా ఆర్జీవికి ఓ పంచ్ వేశారు మంత్రి కేటీఆర్,… లాక్‌డౌన్‌లో ఇంటింటికీ మద్యం డోర్‌ డెలివరీ చేయాలన్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ నిర్ణయంపై ఆలోచన చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను కోరుతూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

ఇటీవ‌ల బెంగాల్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది, దీనిని ఆర్జీవీ తెలియ‌చేశారు, అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్‌రెడ్డి, కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. దీనికి కేటీఆర్‌ సరదాగా బదులిచ్చారు. హెయిర్‌ కట్‌ గురించే కదా మీరు అడిగేది అంటూ చమత్కరించారు.

దీనికి ఇంకా సార్ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు, మొత్తానికి కేటీఆర్ నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు, లాక్ డౌన్ గురించి అడిగితే మ‌రికొన్ని రోజులు ఇది పొడిగిస్తే బెట‌ర్ అనేది నా అభిప్రాయం అని ఆయ‌న అన్నారు. దీనిపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది అన్నారు మంత్రి కేటీఆర్.